హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బంగారుపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్

కర్నూలు బంగారుపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆదివారం నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో కర్నూలు రెండో పట్టణ పోలీసులు, ఎక్సైజ్ శాఖ, ఈగల్ టీమ్, ట్రైనీ కానిస్టేబుళ్లు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 40 లీటర్ల నాటుసారా, 600 లీటర్ల నాటుసారా ఊట, నంబర్ ప్లేట్లు లేని నాలుగు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.