హైదరాబాద్: 28°C
క్రీడలు

స్మృతి మంధానకు ప్రత్యేక గౌరవం

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధానకు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితికి చెందిన యునిసెఫ్ ఇండియా ఆమెను తమ 'సెలబ్రిటీ అడ్వకేట్'గా నియమించింది. బాలికల హక్కులు, భద్రతతో పాటు క్రీడల్లో బాలికలకు సమాన అవకాశాలు కల్పించేందుకు స్మృతి కృషి చేస్తుంది. ఈ నియామకంపై స్మృతి మంధాన హర్షం వ్యక్తం చేసింది.