హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో శతచండీ మహారుద్రయాగం

NDL: శ్రీశైలంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 20 వరకు పది రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. లోకకల్యాణం కోసం ప్రత్యేక పూజలు, హోమాలు, జప పారాయణాలు నిర్వహిస్తున్నారు. తొలిసారిగా సహస్ర చండీపారాయణ సహిత శతచండీ మహారుద్రయాగం చేపట్టారు. సాయంత్రం అమ్మవారికి శైలపుత్రి అలంకారం, స్వామి అమ్మవార్లకు భృంగివాహన సేవ నిర్వహించనున్నారు.