MLG: వెంకటాపురం మండలం రామప్ప దేవాలయానికి సమీపంలో సింగరేణి చేపట్టనున్న ఓపెన్‌కాస్ట్ బొగ్గు తవ్వకాలను అడ్డుకుంటామని రామప్ప పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ఆకిరెడ్డి రామ్మోహన్‌రావు ఆదివారం తెలిపారు. తవ్వకాలతో చారిత్రక రామప్ప దేవాలయం, రామప్ప చెరువుకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తవ్వకాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: 'రామప్ప ఆలయ పరిరక్షణకు తవ్వకాలు అడ్డుకుంటాం'


