WNP: శ్రీరంగపురం మండల కేంద్రంలో ఆదివారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని సంత బజారులో శ్రీ విజయ దుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఉత్సవాల తొలిరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు


