HNK: ఐనవోలు మండలం నరసింహులగూడెంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం సాయి గౌడ్, జనసేన నియోజకవర్గ కన్వీనర్ గడ్డం శశాంక్‌తో పాటు 100 మందికి పైగా బీఆర్ఎస్‌లో చేరారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హామీల అమలులో వైఫల్యంతో ప్రజలు బీఆర్ఎస్ వైపు వస్తున్నారని అన్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్, జనసేన నేతలు


