హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బర్డ్ ఫ్లూ నియంత్రణకు పకడ్బందీ చర్యలు'

ATP: బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురంలో బర్డ్ ఫ్లూ వ్యాపించిన వెంటనే పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమ్‌చంద్ తక్షణ నివారణ చర్యలు చేపట్టారని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ప్రకాష్ నాయుడు తెలిపారు. పది కిలోమీటర్ల పరిధిలో నిఘా ఏర్పాటు చేసి, పోలీస్, వెటర్నరీ శాఖల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతతో వ్యాధిని అరికట్టడం అభినందనయమని పేర్కొన్నారు.