హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చండీమాతగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు

నెల్లూరు నగరంలోని దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రి వార్షిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు చండీమాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని, ప్రసాదాలను స్వీకరించారు.