హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: SI

WNP: దసరా సెలవుల నేపథ్యంలో ఆత్మకూరు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ వి.జయన్న ఆదివారం సూచించారు. ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు విలువైన వస్తువులను భద్రపరచుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలని SI తెలిపారు.