WNP: పెబ్బేరు మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భవానీ దీక్షలు ప్రారంభమయ్యాయి. ఆదివారం చిన్నారులతో సహా 50 మందికి పైగా భక్తులు ఎరుపు వస్త్రాలు ధరించి భవానీ మాలలు వేసుకున్నారు. తొమ్మిది రోజులపాటు నియమ నిష్ఠలతో దీక్ష కొనసాగించనున్నారు.
తెలంగాణ
ఘనంగా భవానీ దీక్షల ప్రారంభం!


