హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్దాపూర్ డంప్ యార్డుపై గ్రామస్తుల ఆగ్రహం

RR: కొత్తూరు మండలం సిద్దాపూర్ డంప్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జీవో 641 రద్దు చేయాలని కోరుతూ గ్రామస్తులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి. 100 రోజులుగా ఆందోళన చేస్తున్నా పాలకులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ సతీష్, స్థానిక జర్నలిస్టులు దీక్షకు మద్దతు తెలిపారు. డంప్ యార్డ్ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు.