హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కపిలేశ్వరపురం లో మెగాస్టార్ చిరంజీవి సందడి

కోనసీమ: కపిలేశ్వరపురం లో ఆదివారం మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఒక సందర్భంలో అభిమానులను కంట్రోల్ చేయడం పోలీసుల తరం కాలేదు. ఆయన అభిమానులకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. హాస్పిటల్ ప్రారంభించి పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభ లో పాల్గొన్నారు.