హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలి: సీపీఎం

NLG: ఢిల్లీలో ధర్నాకు వెళ్తున్న సీపీఎం నాయకుల ముందస్తు అరెస్టులను ఖండిస్తూ నల్గొండ పెద్దబండ సెంటర్‌లో సీపీఐ నాయకులు నల్లజెండాలతో నిరసన చేపట్టారు. ఎస్‌ఐఆర్ (SIR) విధానం వల్ల పేదలు, దళితులు, మైనారిటీల ఓటు హక్కు తీవ్రంగా కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే తొలగించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.