హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన DSPగా భవాని బాధ్యతల స్వీకరణ

కడప: జిల్లా పోలీస్ శాఖలో కీలక మార్పు చోటుచేసుకుంది. కడప నూతన డీఎస్పీగా టీ.భవాని ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆమెను ఉన్నతాధికారులు కడపకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కడపలోని డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న టీ.భవాని అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.