హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌తో సిరీస్‌కు కివీస్ ప్రత్యేక జెర్సీ

భారత్, న్యూజిలాండ్ మధ్య క్రీడా సంబంధాలు ప్రారంభమై 100 ఏళ్లు పూర్తి కావడంతో కివిస్ జట్టు ప్రత్యేక జెర్సీతో దిగనుంది. త్వరలో భారత్‌తో జరగనున్న OD సిరీస్‌లో న్యూజిలాండ్ ఆటగాళ్లు ఈ ఎడిషన్ జెర్సీని ధరించనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధం, సాంస్కృతిక సంబంధం, పరస్పర గౌరవాన్ని చాటిచెప్పేలా ఈ జెర్సీని రూపొందించారు. దీనికి 'కోటహితాంగ వన్డే షర్ట్' అని పేరు పెట్టారు.