హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాలు కరువు.. రైతులకు కన్నీరు!

ADB: ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది. నార్నూర్ మండలంలో గత 20 రోజులుగా వర్షాలు లేకపోవడంతో పత్తి పంటలు ఎండ తీవ్రతకు దెబ్బతింటున్నాయి. అటు వాన జాడ లేక.. ఇటు భానుడి భగభగ తగ్గక రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికైనా వరుణుడు కరుణించాలని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.