హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోసల రామా రారా..కౌసల్య రామా రారా

గద్వాల్ జిల్లా వ్యాప్తంగా పల్లె పల్లెనా బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. ఐజ మండలంలోని భూంపూర్ గ్రామంలో బతుకమ్మ వేడుకలతో వాతావరణం అంతా సందడిగా మారింది. ఇందులో భాగంగా వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మకు పూజ చేసి ప్రార్థించారు. అనంతరం బతుకమ్మ చుట్టూ చిన్నారులు చేరి కోలాటాల చేతబట్టి కోసల రామా రారా..కౌసల్య రామా రారా అంటూ నృత్యాలు చేశారు.