VSP: బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మొదటి రోజు అమ్మవారు ఆదిలక్ష్మిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారికి భక్తులు లక్ష కుంకుమార్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆదిలక్ష్మిగా కనకమహాలక్ష్మి


