హైదరాబాద్: 28°C
క్రీడలు

'వైభవ్‌‌కు వయసు ప్రతికూలంగా మారకూడదు'

యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీకి వయసు ప్రతికూలంగా మారకూడదని, ప్రదర్శన ఆధారంగానే భారత జట్టులో అవకాశం ఇవ్వాలని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. ఐపీఎల్‌, టీమిండియాకు ఆడే ఆటగాళ్లకు వయసు కొలమానం కాకూడదని పేర్కొన్నాడు. 37 ఏళ్ల కోహ్లీ అయినా, 15 ఏళ్ల వైభవ్‌ అయినా జట్టులో ఎంపికకు ప్రదర్శనే ఏకైక ప్రామాణికం కావాలని ఆయన అభిప్రాయపడ్డాడు.