హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏనుగుల బావి వద్ద శుభ్రత కార్యక్రమం

ATP: గుత్తి పట్టణంలోని పురాతన ఏనుగుల బావి వద్ద ఆదివారం పూర్వ సంపద రక్షణ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బావి చుట్టూ, లోపలి వైపున పెరిగిన ముళ్లపొదలు, నాచు, చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి మాట్లాడుతూ.. పూర్వ సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.