హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తేటగుంటలో పోలీసుల కార్డన్ సెర్చ్.. 24 వాహనాలు సీజ్

KKD: ఆపరేషన్ వజ్ర పహార్‌లో భాగంగా తుని సర్కిల్ పోలీసులు తేటగుంట గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 50 మంది సిబ్బంది పాల్గొన్న ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 24 వాహనాలను సీజ్ చేశారు. గంజాయి, నాటుసారా అక్రమ రవాణా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర సహాయం కోసం 112కు ఫోన్ చేయాలని సూచించారు.