హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆ ఓటమే నా కెరీర్‌లో అత్యంత కఠిన దశ: రోహిత్ శర్మ

2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ ఓటమి తన 19 ఏళ్ల కెరీర్‌లోనే అత్యంత కఠినమైన దశ అని భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ తెలిపారు. ఆ పరాజయం నుంచే తాను ఎంతో నేర్చుకున్నానని, అదే తపనతో 2024 టీ20 ప్రపంచకప్ విజయం సాధించగలిగామని ఆయన పేర్కొన్నాడు. విజయం కంటే వైఫల్యాలే మనకు ఎక్కువ పాఠాలు నేర్పుతాయని రోహిత్ స్పష్టం చేశాడు.