హైదరాబాద్: 28°C
వార్తలు

'రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి'

TG: సదాశివపేటలోని సిద్దాపూర్ రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులను ఆదేశించారు. మాజీ టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి ఆయన రోడ్డును పరిశీలించారు. అనంతరం పలు శాఖల అధికారులతో డ్రైనేజీ, కల్వర్టుల నిర్మాణంపై సమీక్షించారు. పలుమార్లు పనులు చేసినా సమస్య తీరకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.