హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రిలో CC రోడ్డు మరమ్మతు

PDPL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఎక్స్‌రే నిమిత్తం COT నుంచి టీ హబ్ వెళ్లే మార్గం చెడిపోయి, రోగుల రవాణాకు ఇబ్బందిగా మారింది. సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్‌కు ఫిర్యాదులు రావడంతో ఆయన స్పందించారు. సీసీ రోడ్డుకు ఫ్లోరింగ్ చేయించి, రోగులకు ఇబ్బంది లేకుండా సురక్షిత రవాణాకు మార్గం సుగమం చేశారు. పేషంట్ల సౌకర్యమే తన మొదటి ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు.