GDWL: గద్వాల మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్‌ను దుర్భాషలాడి, విధులకు ఆటంకం కలిగించిన అఖీమ్ శ్రీనివాస్ గౌడ్‌పై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కమిషనర్ జానకి రాంసాగర్ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్లు గద్వాల టౌన్ ఎస్సై తెలిపారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, దురుసుగా ప్రవర్తించడం వంటి అంశాలపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
కమిషనర్‌తో దుర్భాషలు.. వ్యక్తిపై కేసు


