హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాలక్ష్మి రూపంలో జమ్ములమ్మ దర్శనం

దేవీ శరన్నవరాత్రుల ప్రారంభం సందర్భంగా గద్వాల పట్టణంలోని జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ దేవాలయంలో ఆదివారం తొలిరోజు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పూజా పీఠం కింద ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గబ్బిలం పక్షి ఆకార విశేష అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వేకువజాము నుంచే ఆలయానికి భక్తులు వచ్చారు.