హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ

VZM: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఆధ్యాత్మిక సందడి మొదలైంది. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వాడ వాడలా పలువురు భక్తులు భవానీ మాలలు ధరించి దీక్షలు స్వీకరిస్తున్నారు. విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి భవానీ మాలలు ధరించారు.