హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా?

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి తలనొప్పి, చిరాకు వస్తుంది. రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరానికి శక్తి అందకపోతే మెదడు పనితీరు మందగిస్తుంది, ఏకాగ్రత తగ్గుతుంది. ఉదయం అల్పాహారం తినకపోతే జీవక్రియ వేగం తగ్గి క్యాలరీలు బర్న్ కావు. మధ్యాహ్నం ఆకలి ఎక్కువై జంక్ ఫుడ్ లేదా అధికంగా తినే పరిస్థితి వస్తుంది. గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.