నటరాజాసనం (డ్యాన్సర్ పోజ్) ఒక కాలుపై నిలబడి చేసే ఆసనం కావడం వల్ల శరీర బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. ఒకే బిందువుపై దృష్టి పెట్టడం ద్వారా మానసిక ఏకాగ్రత పెరుగుతుంది. నిలబడే కాలు, తొడలు, పిరుదులు, చీలమండలు బలోపేతం అవుతాయి. కోర్ (నడుము భాగం) కండరాలు శక్తిని పుంజుకుంటాయి. వెనుకకు వంగి చేసే ఈ ఆసనం వల్ల వెన్నెముక, భుజాలు, ఛాతీ భాగాలకు మంచి సాగతీత (స్ట్రెచ్) లభిస్తుంది.
ఆరోగ్యం
నటరాజాసనం వల్ల కలిగే ఉపయోగాలు


