హైదరాబాద్: 28°C
వార్తలు

శరన్నవరాత్రి ఉత్సవాలు.. అమ్మకు నైవేద్యాలు

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారు రోజుకో అలంకరణలో దర్శనమిస్తారు. రోజుకో నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. తొలిరోజు కట్టె పొంగలి, తర్వాత.. పులిహోరా, క్షీరాన్నం, బెల్లం అన్నం లేదా పాయసం, దద్దోజనం, అల్లం గారెలు లేదా పిండి వంటలు, వడపప్పు లేదా పానకం, నిమ్మరసం నైవేద్యం, పూర్ణం బూరెలు లేదా షడ్రుచుల భోజనం నైవేద్యంగా పెడతారు. అయితే, ప్రాంతాన్ని బట్టి కొంచెం మారుతాయి.