హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఈ లక్షణాలను గుర్తించండి!

బయటకు నవ్వుతూ కనిపించినా, లోపల తీవ్ర మానసిక వేదన అనుభవించడం మాస్క్డ్ డిప్రెషన్ లక్షణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. బాధను ఇతరులకు తెలియనివ్వకుండా రోజువారీ పనులు కొనసాగిస్తుంటారు. నిరంతర అలసట, నిద్రలో మార్పులు, ఒంటరితనం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు.