హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రేమ నిరాకరించిందని యువతికి వేధింపులు

PDPL: ప్రేమను నిరాకరించిందని యువతిని వేధిస్తూ, ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. పంజాగుట్టలోని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు సమయంలో పరిచయమైన పెద్దపల్లి జిల్లాకు చెందిన రామడుగు విజయ్‌ (22), యువతి ఫోన్ నుంచి బంధువుల వివరాలు సేకరించి ఆమె సోదరికి ఫోన్ చేసి బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించింది.