JN: స్టేషన్‌ఘన్‌పూర్ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన కేశోజు యశ్వంత్‌చారి అంతర్జాతీయ వడ్రంగి పోటీల్లో ప్రతిభ కనబరిచారు. చైనాలోని షాంఘైలో గత నెల 22 నుంచి 27 వరకు 25 దేశాల మధ్య నిర్వహించిన పోటీల్లో పాల్గొని ‘మెడల్ ఫర్ ఎక్సలెన్స్’ పురస్కారాన్ని సాధించారు. ఈ పోటీల్లో ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటారు. శనివారం అతడిని గ్రామస్థులు సన్మానించారు.
తెలంగాణ
అంతర్జాతీయ వడ్రంగి పోటీల్లో యశ్వంత్‌చారి ప్రతిభ


