హైదరాబాద్: 28°C
తెలంగాణ

నంబర్ ప్లేట్లు లేకుండానే మట్టి ట్రాక్టర్ల రాకపోకలు

JGL: కోరుట్ల పట్టణంలోని ప్రధాన రహదారిపై నంబర్ ప్లేట్లు లేకుండా ట్రాక్టర్లు, ట్రాలీలతో అక్రమంగా మట్టి, ఇసుక తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదుల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా పోలీసు, రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.