హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యం మత్తులో పోలీసు కానిస్టేబుల్‌పై దాడి

BHPL: మద్యం మత్తులో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఘటనలో ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం చిట్యాల ప్రధాన కూడలిలో ఘర్షణను అడ్డుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ మారబోయిన మహేశ్‌పై తుమ్మల గణేశ్‌, చిలువేరి దేవ, సాయినాథ్‌ దాడి చేశారు. గాయపడిన కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్‌ తెలిపారు.