హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

MDK: తూప్రాన్ మండలంలో శనివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే మహిళలు తంగేడు, గునుగు, బంతి తదితర రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం గ్రామాల్లోని కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేసి సంప్రదాయబద్ధంగా ఆటపాటలతో సందడి చేశారు. ఊరూరా వేడుకలు జరగడంతో పండుగ వాతావరణం నెలకొంది.