హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పశు వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి'

KMR: రైతులు పశువైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి రమేష్ తెలిపారు. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో శనివారం పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశు వైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పశు వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామాల్లో ప్రత్యేకంగా నిర్వహించే పశువైద్య శిబిరాల్లో తమ పశువులకు చికిత్సలు నిర్వహించుకోవాలని సూచించారు.