WGL: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు అక్టోబర్ 10 నుంచి 21 వరకు 12 రోజుల సెలవులు ప్రకటించారు. సెలవుల్లో లబ్ధిదారులకు టేక్ హోమ్ రేషన్ పంపిణీ చేయనున్నారు. అక్టోబర్ 22 నుంచి కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయి. సెలవులు మంజూరు చేసిన మంత్రి సీతక్కకు అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు డి.అన్నపూర్ణ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
అంగన్‌వాడీలకు 12 రోజుల దసరా సెలవులు


