అనకాపల్లిలో శనివారం టౌన్ పోలీసులు, ఈగల్ టీం సంయుక్త ఆధ్వర్యంలో వివిధ లాడ్జిలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లాడ్జిలలో ఉన్న వ్యక్తుల వివరాలను సేకరించారు. వారి లగేజ్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులకు డ్రగ్ టెస్టులు చేశారు. తనిఖీలలో ఈగల్ టీం సీఐ నారాయణరావు, టౌన్ ఎస్ఐ షేక్ జిలాని, ఈగల్ టీం సిబ్బంది భాస్కరరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టౌన్ పోలీసులు, ఈగల్ టీం ఆధ్వర్యంలో తనిఖీలు


