MHBD: జిల్లా మరిపెడ మండలం ఊకల్లో వీధి కుక్కల దాడిలో బోయిన వెంకన్న,బోర గంగయ్యలకు చెందిన 20 గొర్రె పిల్లలు మృతి చెందాయి. గొర్రె పిల్లల మృతితో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. గ్రామాల్లో వీధి కుక్కల బెడదను నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండ చూడాలన్నారు.
తెలంగాణ
కుక్కల దాడిలో 20 గొర్రె పిల్లలు మృతి


