MBNR: నవాబ్‌పేట మండలం పోమాల్ గ్రామానికి చెందిన ఈశ్వర్ ఆత్మహత్య కేసులో నిందితుడు పిడుగు సుధాకర్ (A1)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 5న భార్య, అత్తమామలు, మరో వ్యక్తి వేధింపులు తాళలేక ఈశ్వర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తెలంగాణ
ఆత్మహత్య కేసులో A1 అరెస్ట్


