TPT: సూళ్లూరుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.కోటి మంజూరైనట్లు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. ఇందులో రూ.62.28 లక్షలతో నాగరాజపురంలో సీసీ రోడ్డు, మన్నారుపోలూరులో డ్రైనేజీ నిర్మాణ పనులకు శనివారం భూమిపూజ చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సూళ్లూరుపేట అభివృద్ధికి రూ.కోటి నిధులు


