హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ డెయిరీకి రూ.1.85 కోట్ల నిధులు

HNK: విజయ తెలంగాణ డెయిరీ అభివృద్ధి, ఆధునీకరణకు హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ రూ.1.85 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఉపసంచాలకుడు జి. ధనరాజ్ తెలిపారు. తొలి విడతగా రూ.89.50 లక్షలు విడుదలయ్యాయన్నారు. పనుల నేపథ్యంలో అక్టోబర్ 10 నుంచి ప్యాకింగ్ తాత్కాలికంగా నిలిపివేసి, రావిర్యాల మెగా డెయిరీ నుంచి పాల ఉత్పత్తులను సరఫరా చేస్తామన్నారు.