హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గిద్దలూరులో సీఐటీయూ నిరసన

ప్రకాశం: గిద్దలూరులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఆవులయ్య మాట్లాడుతూ.. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫామ్-6 పేరుతో దేశవ్యాప్తంగా కోట్లాది ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఈ ఓట్లను పునరుద్ధరించి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.