హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

కృష్ణా: గుడివాడ మండలం నూజెల్ల గ్రామంలో రూ.7లక్షలు, చిరిచింతల గ్రామంలో రూ.18 లక్షలు, సేరిదింటకుర్రు గ్రామంలో రూ.18 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాము శనివారం శంకుస్థాపన చేశారు. గుడివాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.