హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరుతడి పంటలు సాగు చేయాలి: ఎమ్మెల్యే సామేలు

SRPT: తిరుమలగిరిలో ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ, విద్యుత్‌ కోతలపై బీఆర్ఎస్‌ విమర్శలు రాజకీయ నాటకాలన్నారు. ఈ సీజన్‌లో నియోజకవర్గంలో 1.20 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని, ధాన్యానికి మంచి ధరలు లభిస్తున్నాయని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పెసలు, వేరుశనగ, మినుములు, శనగ వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.