హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల త్రిపురసుందరీ దేవి ఆరాధనతో శక్తి: గురురాజ శర్మ

SRD: ఖేడ్ పట్టణానికి చెందిన ప్రముఖ వేద పండితులు గురురాజ శర్మ శరన్నవరాత్రి ఉత్సవాల విశిష్టతను నేడు వివరించారు. శరన్నవరాత్రులలో తొలి రోజు అమ్మవారిని బాల త్రిపురసుందరీ దేవిగా పూజించడం వల్ల సకల శక్తులు లభిస్తాయని తెలిపారు. తొమ్డేళ్ల బాలిక రూపంలో, ప్రాణశక్తి స్వరూపిణిగా విరాజిల్లే ఆ ఆదిపరాశక్తిని భక్తితో ఆరాధిస్తే శత్రు నాశనం, మనశ్శాంతి కలుగుతుందన్నారు.