హైదరాబాద్: 28°C
వార్తలు

ఆపరేషన్ త్రిశూల్‌తో ప్రజలకు అవగాహన

అన్నమయ్య: చిట్వేల్ మండలం కె.ఎస్. అగ్రహారం గ్రామంలో ఎస్సై వినోద్ కుమార్ సిబ్బందితో కలిసి ఆపరేషన్ త్రిశూల్ నిర్వహించారు. మహిళా భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. వేధింపులకు గురైతే 112కు ఫోన్ చేయాలని, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.