హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదివాసీ సమస్యల పరిష్కారం కోసం పోరాడతాం..

BDK: పాల్వంచ కొమరం భీమ్ భవన్‌లో శనివారం ఆదివాసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 5న జరిగిన మహాధర్నాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ధర్నాలో జరిగిన పొరపాట్లపై చర్చించి, ఇకపై జేఏసీ తీర్మానాల మేరకే నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. నవంబర్‌లో నాలుగు జిల్లాల కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాలు నిర్వహించి, సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగించాలని తీర్మానించారు.