NLG: చొప్పరివారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఇంకుడు గుంతలు, మ్యాజిక్ సోక్ పిట్ల నిర్మాణ పనులు ముమ్మరంగా చేపడుతున్నట్లు పంచాయతీ కార్యదర్శి గంట సంధ్య తెలిపారు. వర్షపు నీటితో భూగర్భ జలాలను పెంపొందించడం, వ్యర్థ నీరు రోడ్లపైకి రాకుండా అడ్డుకోవడం వీటి ప్రధాన లక్ష్యమన్నారు. దీంతో పరిసరాల పరిశుభ్రత పెరిగి దోమల బెడద తగ్గుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
చొప్పరివారిగూడెంలో ఇంకుడు గుంతల నిర్మాణం


